B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కాదు!. బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అని మాత్రమే మనకు తెలుసు. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని బీజేపీ వేరే అర్థం చెబుతోంది. బీఎస్సీ అంటే బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలంటోంది. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సరికొత్త ఫార్ములాతోనే గెలవాలనుకుంటోంది. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నాయకత్వంలో హిమాచల్‌ప్రదేశ్‌లో కమలనాథులు వరుసగా రెండోసారి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ రాష్ట్రానికి చెందినవారే. కాబట్టి పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌పుత్‌లు 30 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానం షెడ్యూల్డ్ కులాల(ఎస్సీల)దే. ఎస్సీలు 25 శాతం, బ్రహ్మణులు 19 శాతం, ఓబీసీలు 14 శాతం ఉన్నారు. మొత్తం 68 సీట్లు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే ముందుగా రాజ్‌పుత్‌లను ప్రసన్నం చేసుకోవాలి. జనరల్ సీట్లు 48 ఉండగా అందులో 33 కన్నా ఎక్కువ సీట్లలోనే రాజ్‌పుత్‌ల ఆధిపత్యం నెలకొంది.
Also Read
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ఒక వైపు సీఎం జైరామ్ ఠాకూర్, మరో వైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తమ కులం ఓట్లు బీజేపీకే పడేలా కృషి చేస్తున్నారు. రాజ్‌పుత్‌లతోపాటు బ్రాహ్మణులను, షెడ్యూల్డ్ కులాల వారిని సైతం ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. బీఎస్సీ ఫ్యాక్టర్‌ను మాత్రమే పూర్తిగా నమ్ముకోకుండా హతీ వర్గాన్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే హతీ కమ్యూనిటీకి గిరిజన హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సీఎం జైరామ్ ఠాకూర్ ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని కలిశారు.
షెడ్యూల్డ్ కులాలతోపాటు ఇతర కులాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని బీజేపీ సర్కారు వివక్షకు తావు లేకుండా ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిందని, తద్వారా అన్ని వర్గాల ప్రజల మనసులను గెలుచుకున్నామని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉనికిలోనే లేదని, జాతీయ కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాడుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!