NTV Telugu Site icon

ఒక్క‌ టమోటా చెట్టుకు 839 కాయ‌లు…కిటుకు తెలిస్తే ధ‌ర‌లు…

ప్ర‌స్తుతం దేశంలో ట‌మోటా ధ‌ర‌ల మోత మోగుతున్న‌ది.  ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌టంతో ట‌మోటా కొనుగోలు చేయాలంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు.  వారం క్రితం వ‌ర‌కు కిలో 20 కూడా ప‌ల‌క‌ని ట‌మోటాలు ఇప్పుడు ఏకంగా కిలో రూ.60కి పైగా ప‌లుకుతున్నాయి.  రాబోయే రోజుల్లో కిలో ట‌మోటాలు వంద‌కు చేరే అవ‌కాశం ఉన్న‌ది.  ఒక ట‌మోటా చెట్టుకు మ‌హా అయితే ఒకేసారి 5 నుంచి 6 కాయ‌లు కాస్తాయి.  కానీ, ఓ వ్య‌క్తి కొత్త ప‌ద్ధ‌తుల్లో సాగు చేయ‌డంతో ఒక చెట్టుకు ఏకంగా 839 కాయ‌లు కాశాయి.

చెర్రీ ట‌మోటాలుగా పిలిచే కాయ‌ల‌ను స్నాక్స్ త‌యారు చేయ‌డానికి వినియోగిస్తార‌ట‌.  ఇంగ్లాండ్‌కు చెందిన డ‌గ్ల‌స్ స్మిత్ అనే వ్య‌క్తి ఈ రికార్డును సాధించాడు. ఐటీ జాబ్‌ను వ‌దిలేసి వ్య‌వ‌సాయం చేయ‌డం మొద‌లుపెట్టారు.  కొత్త ప‌ద్ద‌తుల ద్వారా సాగు చేసే విధానంను క‌నుగొని చెర్రీ ట‌మోటా పంట‌ను సాగు చేస్తున్నాడు.  గ్రీన్ హౌస్ ప‌ద్ద‌తిలో సాగు చేయ‌డం ద్వారా ఇది సాద్యం అయింద‌ని స్మిత్ చెప్పుకొచ్చారు.  

Read: ప్ర‌ధానికి షాకిచ్చిన సూడాన్ సైన్యం… రాజ‌ధానిలో…