NTV Telugu Site icon

Breaking: పుష్ప 2 ఆర్టిస్టుల బస్సుకు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Road Accident2

Road Accident2

పుష్ప 2 ఆర్టిస్టుల బస్సుకు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టిస్టులకు తీవ్రగాయాలు అయ్యాయి.. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన నటులు విజయవాడకు చేరుకోగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. అతి వేగం కారణమని పోలీసులు గుర్తించారు..

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఆర్టిస్టులంతా ఓ ప్రైవేట్ బస్సులో బయలు దేరారు.. నార్కట్ పల్లికి రాగానే ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సును ఢీ కొట్టినట్లు సమాచారం.. ఈ ప్రమాద సమయంలో బస్సు చాలా వేగంగా రావడంతో కంట్రోల్ చెయ్యలేను బస్సును ఢీ కొట్టాడు.. ఈ బస్సులో 20 మందికిపైగా ప్రయానిస్తున్నారని తెలుస్తుంది.. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ ఇద్దరికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి..

ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. కేసు నమోదు చేసుకొని,క్షత గాత్రులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు.. ఈ ప్రమాదంతో హైవే పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.. పోలీసులు జ్యోక్యం చేసుకొని వెంటనే క్లియర్ చేశారు.. ఈ ప్రమాదంలో బస్సుకు డ్యామేజ్ అయ్యిందని తెలుస్తుంది..దీంతో సినిమా షూటింగ్ ఆగిందని సమాచారం..