Site icon NTV Telugu

స్పేస్ యుద్ధం: బెజోస్‌పై ఎల‌న్ పైచేయి…

అమెజాన్ సంస్థ అంత‌రిక్ష‌రంగంలోకి ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే.  జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ సంస్థ ఇటీవ‌లే అంత‌రిక్ష యాత్ర‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది.  క‌మ‌ర్షియ‌ల్‌గా వ్యోమ‌గాముల‌ను స్పేస్‌లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  అయితే, ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఇప్ప‌టికే ఐఎస్ఎస్‌కు కావాల్సిన స‌రుకుల‌ను చేర‌వేస్తూ అంద‌రికంటే ముందు వ‌ర‌స‌లో ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే చంద్రుడిమీద‌కు వ్యోమ‌గాముల‌ను తీసుకెళ్లేందుకు నాసా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో ఈ ప్ర‌యోగం చేస్తున్న‌ది.  

Read: వైర‌ల్‌: పాస్‌పోర్ట్ క‌వ‌ర్ కోసం ఆర్డ్‌ర్ చేస్తే… ఏకంగా పాస్‌పోర్టే వ‌చ్చేసింది…

నాసా ల్యూనార్ ల్యాండ‌ర్ ను త‌యారు చేసే బాధ్య‌త‌ను ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌కు అప్ప‌గించింది నాసా.  సాంకేతిక లోపాలు ఉన్న‌ప్ప‌టికీ ల్యూనార్ ల్యాండ‌ర్ బాధ్య‌త‌ల‌ను స్పేస్ ఎక్స్‌కు అప్ప‌గించార‌ని, ఈ కాంట్రాక్ట్‌ను ర‌ద్దుచేయాల‌ని కోరుతూ బ్లూఆరిజిన్ ఫెడ‌ర‌ల్ కోర్టును ఆశ్ర‌యించింది.  అయితే, కోర్టుకు విచార‌ణ ఆల‌స్యం కాకుండా విచార‌ణ చేయాల‌ని నాసా కోర్టుకు తెలియ‌జేసింది.  ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న ఫెడ‌ర‌ల్ కోర్టు బ్లూ ఆరిజిన్ ఆరోప‌ణ‌లను కొట్టివేసింది.  నాసా ముందు అనుకున్న‌ట్టుగానే ముందుకు వెళ్లాల‌ని తీర్పు ఇచ్చింది.  

Exit mobile version