తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని, కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలు బజార్ రౌడీల్లా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీని బదనాం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేదు. రైతుల మీద ప్రేమ ఉంటే రుణ మాఫీ చేయండి. మెడికల్ కాలేజీ ల కోసం మూడు సార్లు లేఖ లు రాశాం. లేఖలు చదువరు.. కానీ బీజేపీ మీద బురద జల్లుతున్నారని విమర్శించారు ఎంపీ బాపురావు. టీఆర్ఎస్ రైస్ మిల్లర్ల లాభం కోసం తప్ప రైతులకు లాభం కోసం పని చేయడం లేదన్నారు. ప్రధాని మోడీపై టీఆర్ ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదన్నారు.