NTV Telugu Site icon

ఏడో రౌండ్‌లో ఎగిరిన బీజేపీ జెండా.. లీడ్‌లో కొనసాగుతున్న ఈటల

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌ నుంచి ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కొనసాగుతున్నారు. ఆరో రౌండ్‌ ముగిసే సరికి 3,186 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

అయితే తాజాగా.. ఏడో రౌండ్‌ ఫలితాల్లో మళ్లీ ఈటల తన సత్తా చాటారు. ఏడో రౌండ్‌ ముగిసే సరికి 3,438 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం అధికారులు వీణవంక మండలంలోని ఓట్లు లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీనే లీడ్‌లో కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ఏ రౌండ్‌లోకూడా లీడ్‌లోకి రాలేదు.