NTV Telugu Site icon

చ‌దువుకున్న కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు వెళ్తూ…

భార‌త్‌లో అత్యంత శ‌క్తివంత‌మైన సైనికాధికారి బిపిన్ రావ‌త్ ఈరోజు మ‌ధ్యాహ్నం హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో క‌న్నుమూశారు.  ఉదయం ఢిల్లి నుంచి త‌మిళ‌నాడులోని వెల్లింగ్ట‌న్ ఆర్మీ క‌ళాశాల‌కు వెళ్తున్న స‌మ‌యంలో కూనూరు వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులిక‌, మ‌రో 11 మంది సైనికులు మృతి చెందారు.  ఉత్త‌రాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జ‌న్మించిన బిపిన్ రావ‌త్ ప్రాథ‌మిక విద్య‌ను డెహ్ర‌డూన్‌, సిమ్లాలో పూర్తిచేశారు.  తండ్రి ఇచ్చిన స్పూర్తితో నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో సీటు సంపాదించారు.  

Read: ఎంఐ హెలికాప్ట‌ర్ సాంకేతికంగా భ‌ళా… కానీ…

త‌మిళ‌నాడులోని వెల్లింగ్ట‌న్ కంటోన్మెంట్‌లో ఉన్న నేష‌న‌ల్ డిఫెన్స్ స్టాఫ్ స‌ర్వీసెస్ అకాడ‌మీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.  ఆ త‌రువాత అమెరికా వెళ్లి అక్క‌డ హ‌య్య‌ర్ క‌మాండ్ కోర్సును పూర్తిచేసి ఇండియాలో అహ‌ల్య విశ్వ‌విద్యాల‌యంలో ఎంఫిల్ పూర్తిచేశారు.  అప్ప‌టికే ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించిన బిపిన్ రావ‌త్ అంచ‌లంచెలుగా ఎదుగుతూ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప‌ద‌విని చేప‌ట్టారు. తాను చ‌దువుకున్న వెల్లింగ్ట‌న్ ఆర్మీ క‌ళాశాల‌లో లెక్చ‌ర్ ఇచ్చేందుకు వెళ్తుండ‌గా జ‌రిగిన ప్రమాదంలో ఆయ‌న మ‌ర‌ణించారు.