NTV Telugu Site icon

ఈటలకు మరో ఎదురుదెబ్బ..గంగులను కలిసిన కీలక నేతలు !

మాజీ మంత్రి ఈటలకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలు టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించగా.. తాజాగా మంత్రి గంగులను శనిగరం, మర్రిపల్లిగూడెం ప్రజాప్రతినిధులు కలిసి ఈటలకు షాక్ ఇచ్చారు. మంత్రి గంగులను కలవడమే కాకుండా.. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి గంగులకు వినతి పత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా మంత్రి గంగుల హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వెల్లడించారు మంత్రి గంగుల. ఈటల బర్తరఫ్ తో తమకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఈటల ఉద్యమకారులను పక్కనపెట్టి సొంత వారికి పెద్దపీట వేశారని.. ఈటల ది డివైడ్ అండ్ రూల్ పాలసి అని శనిగరం, మర్రిపల్లిగూడెం ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను అనగదొక్కడాని.. పార్టీని అడ్డుపెట్టుకొని ఆర్ధికంగా ఎదిడాని ఫైర్ అయ్యారు. సొంత మండలంలో అభివృద్ధి అంతంత మాత్రమేనని.. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని వారు వెల్లడించారు.