Site icon NTV Telugu

ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఇదే!

మన జెండా.. మువ్వన్నెల పతాకం మన జాతి ఔన్నత్యానికి ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఎక్కడుందో తెలుసా? నేవీ డే సందర్భంగా ఆర్థిక రాజధాని ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జాతీయ జెండా ఆషామాషీగా లేదు. చాలా పెద్దది. జాతీయ జెండా 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు, 1400 కేజీల బరువుతో ఉన్న మన జెండా అందరినీ ఆకట్టుకుంటోంది. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో దీన్ని ప్రదర్శించారు. ఈ భారీ జెండాను ఖాదీతో తయారుచేయడం విశేషం.

ఇంతకుముందు లడఖ్‌లోని లేహ్‌లో అతి పెద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అప్పట్లో అదే అతిపెద్ద జాతీయ జెండాగా ఖ్యాతిపొందింది. 2021 అక్టోబర్ 02 న మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా లడఖ్‌లోని లేహ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈజాతీయ జెండాను లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కే మాథుర్ ఎగురవేశారు.

ladakh tricolour indian flag

ఖాదీ గ్రామం, పరిశ్రమల కమిషన్‌కు అనుబంధంగా ఉన్న ముంబైలో ఉన్న ఖాదీ డైయర్స్ ప్రింటర్స్ ఈ జెండాను తయారు చేశారు. ముంబై నుండి లేహ్‌కు జాతీయ జెండాను తీసుకువచ్చే బాధ్యత, ఆవిష్కరణ వేడుక కోసం ఎత్తైన పర్వతాల పైభాగంలో దాన్ని ఇన్‌స్టాల్ చేసే బాధ్యతను కూడా సూరా-సోయి ఇంజనీర్ రెజిమెంట్‌కు అప్పగించారు. ఈ త్రివర్ణం 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కలిగి వుంది. దీని బరువు దాదాపు 1,000 కిలోలు. ఈ జెండా కంటే ఇప్పుడు ముంబైలో ప్రదర్శించిన జాతీయ జెండా బరువు 400 కేజీలు ఎక్కువ. పొడవు, వెడల్పు సమానమే.

Exit mobile version