NTV Telugu Site icon

వైఎస్‌ షర్మిలకు షాక్.. మా ఇంటికి రావొద్దు…!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిలకు ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి కుటుంబం షాక్‌ ఇచ్చింది.. తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ఫోకస్‌ పెట్టిన షర్మిల.. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్‌ కుటుంబసభ్యులను పరామర్శించి.. ఆ తర్వాత దీక్ష చేయాలని ప్లాన్‌.. కానీ, రేపటి షర్మిల నిరసన దీక్షకు తాము సహకరించబోమని ప్రకటించారు నరేష్‌ తండ్రి భుక్యా శంకర్ నాయక్.. వైఎస్‌ షర్మిల తమ ఇంటికి రావద్దంటూ ఆత్మహత్య చేసుకున్న భుక్యా నరేష్ తండ్రి భూక్యా శంకర్ నాయక్ విజ్ఞప్తి చేస్తున్నారు.. మా కొడుకు నరేష్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమేనన్న శంకర్‌ నాయర్.. మా కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నాం.. మా కొడుకు చావును రాజకీయం చేయవద్దంటూ.. వైఎస్‌ షర్మిలకు విజ్ణప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు నరేష్ తండ్రి భుక్యా శంకర్ నాయక్. మరి రేపటి నిరుద్యోగ దీక్ష ఉంటుందా? లేక వాయిదా వేస్తారా? మరో ప్రాంతంలో దీక్ష చేస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.