నందమూరి నటసింహం బాలయ్య బాబు, అనిల్ రావీపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. మొదటి షోకే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల కూతురి పాత్రలో నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. టీజర్ అండ్ ట్రైలర్ తో మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్స్ లో ఎంత వరకు ఆకట్టుకుంది..? లెజెండ్, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ లో ఉన్న బాలకృషకి ఈ సినిమా హ్యాట్రిక్ ఇచ్చిందని పబ్లిక్ టాక్..
ఇకపోతే ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో సినిమాపై ఆడియన్స్ తమ అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ పర్లేదు అంటున్నారు. కథ, కథనాల్లో కొత్తదనం లేదు. అదే రొటీన్ కమర్షియల్ మూవీ… అనే వార్తలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి..ఎమోషనల్ సీన్స్, బాలకృష్ణ మాస్ అప్పీరెన్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అలరించాయని అంటున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే సినిమాను ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. భగవంత్ కేసరి చిత్రానికి థమన్ సంగీతం మైనస్ అన్న మాట వినిపిస్తుంది. బీజీఎమ్ ఓ మోస్తరుగా ఉన్నా… సాంగ్స్ నిరాశపరిచాయని అంటున్నారు. కథలో శ్రీలీల కీలకం. కాజల్ పాత్రకు ప్రాధాన్యత అంతగా లేదు.. ఎప్పటిలాగే బాలయ్య తన పాత్రకు న్యాయం చేసాడని టాక్..
ఇక ఈ సినిమా ఏ ఓటిటీ ప్లాట్ పామ్ లో వస్తుందా ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది..ఫ్యాన్సీ ధర చెల్లించి ప్రైమ్ భగవంత్ కేసరి హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. బాలకృష్ణ గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. భగవంత్ కేసరి మాత్రం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.. ఈ దసరా బరిలో దిగిన బాలయ్య భగవంత్ కేసరి టార్గెట్ రూ. 65 కోట్లు. బాలయ్య మార్కెట్ రీత్యా కొంచెం ఎక్కువే. ఫెస్టివ్ సీజన్ కలిసొస్తుందని బయ్యర్లు నమ్ముతున్నారు. రూ. 66 కోట్లు వస్తే కానీ మూవీ హిట్ అవుతుంది.. మరి జనాలు ఈ సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.. ఫ్యాన్స్ మాత్రం సినిమా బ్లాక్ బాస్టర్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు..