విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఈ నెల 10న బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ కార్యకమానికి సీఎం జగన్, ఇతర మంత్రులు హాజరవుతారు. దీంతో రెండో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు రహదారుల శాఖ మంత్రి శంకరనారాయణ, అధికారులు.
ఈనెల 10న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 16వేల 500 కోట్లతో 1045 కిలోమీటర్లు చేసే 41 ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 41 ప్రాజెక్టుల ప్రారంభానికి సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడలో మోర్త్ ఆర్ఓ కార్యాలయం ప్రారంభించనున్నారు. రద్దీ ఉన్న విజయవాడ సిటీకి ఈస్ట్రన్ బైపాస్ తీసుకు రావాలని కేంద్రాన్ని కోరతాం. అన్ని ప్రధాన రహదారులను నేషనల్ హైవేలుగా చేయాలని కోరనున్నామన్నారు మంత్రి శంకర నారాయణ. పదవ తారీఖు జరిగే అన్ని కార్యక్రమాలలో సీఎం పాల్గొంటారని ఆయన తెలిపారు.