Site icon NTV Telugu

బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా

ఈనెల 10న జరగాల్సిన విజయవాడ బెంజ్ సర్కిల్-2 ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం గతంలో ఓ సారి వాయిదా పడగా.. తాజాగా మరోసారి వాయిదా పడింది. సీడీఎస్ బిపిన్ రావత్ మరణంతో.. రేపు ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన విజయవాడ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Read Also: పర్యాటకులకు శుభవార్త… త్వరలో విశాఖలో స్నో పార్కు ఏర్పాటు

కాగా తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో రూ.16వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని కొన్నిరోజుల కిందట వార్తలు వచ్చాయి. విజయవాడ నగరంలో స్క్రూబ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటల్ హోటల్ మధ్య సుమారు రూ.88 కోట్లతో బెంజ్ సర్కిల్లో రెండో ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. సుమారు 2.47 కిలోమీటర్ల మేర బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందని అధికారులు చెప్తున్నారు.

Exit mobile version