‘ఇడియట్’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘సూపర్’, ‘దేశముదురు’, చిరుత’, ‘గోలీమార్’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘టెంపర్’, ‘హార్ట్ ఎటాక్’, ‘ఇస్మార్ట్ శంకర్’… పూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే బీచ్ సాంగ్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన బ్యాంకాక్, పటాయా, గోవా, మారిషస్ బీచ్ లలో తన సినిమాల్లో ఏదో ఒక సాంగ్ తప్పనిసరిగా ప్లాన్ చేస్తుంటారు. అసలు ఆయన సినిమా కథలే బీచ్ లో పుడతాయి. అదో సెంటిమెంట్ గా మారింది పూరికి. బీచ్ పాటలు ఆయనకు సక్సెస్ మంత్ర అనే చెప్పవచ్చు. అందుకే మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారట. విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో ఓ బీచ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. విజయ్ కూడా అందుకు సై అన్నాడట. కరోనా అదుపులోకి రాగానే మారిషస్, మాల్దీవుల్లో ఈ పాట తీయాలనుకుంటున్నారట. మరి పూరి బీచ్ సాంగ్ సెంటిమెంట్ ‘లైగర్’ కి ఏ మేరకు కలసి వస్తుందో చూడాలి.
‘లైగర్’లో బీచ్ సాంగ్… మరోసారి పూరి సెంటిమెంట్
