Site icon NTV Telugu

ఓబీసీ, ఈబీసీల ఆదాయ పరిమితి పెంపు.. కేసీఆర్‌కి థ్యాంక్స్

తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పెంచిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్. బీసీ, ఈబీసీ, డీఎన్ టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని పెంచడంపట్ల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కే. కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఓబీసీ, ఈబీసీ స్కాలర్ షిప్స్ కి విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి పెంచింది. వార్షిక ఆదాయం పరిమితి రెండున్నర లక్షలకు పెంచారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునేవారి ఆదాయం రూ.1.50 లక్షలు, ఈబీసీల వార్షికాదాయం లక్షా రూపాయలు, డీఎన్ టీ విద్యార్థుల ఆదాయం రూ. 1లక్షా 50 వేలుగా ఉండేది. దాన్ని ఓబీసీ, ఈబీసీ, డీఎన్ ల వార్షికాదాయాన్ని సీఎం కేసీఆర్ రూ.2లక్షల 50 వేలకు పెంచారు.

విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయాన్ని పెంచుతూ జీఓ జారీ చేయడం వల్ల లక్షలాదిమంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుందని అన్నారు.
ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు కిశోర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం సబ్బండ వర్గాల అభివృద్ధి గురించి ఆలోచించే సీఎం కేసీఆర్..బీసీల ఆదాయం పెంచేందుకు అద్భుత పథకాలకు రూపకల్పన చేస్తున్నారని అన్నారు. బహుజన వర్గాలు చదుకునేందుకు గురుకులాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, వారి జీవితాల్లో వెలుగులు చూడాలనే ఆకాంక్షతో నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.

Exit mobile version