Site icon NTV Telugu

అక్టోబర్‌లో 21 రోజులు బ్యాంకులకు సెలవులు !

అక్టోబరు నెలలో దేశంలోని బ్యాంకులకు.. 21 రోజుల పాటు సెలవులను భారత రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా 21 రోజుల పాటు వేర్వేరు రోజుల్లో సెలవులు ఇచ్చారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం అక్టోబరు నెలలో 14 రోజులపాటు సెలవులున్నాయి. దీంతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఏడు వారాంతపు సెలవులున్నాయి. అక్టోబరు 1వతేదీన బ్యాంకుల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కాబట్టి… గ్యాంగ్ టక్ లో మొదటి సెలవు. అక్టోబరు 2వతేదీన గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఇలా పలు పండుగలను పురస్కరించుకొని ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. అయితే..ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఇది ఇలా ఉండగా.. బ్యాంకుల సెలవులను తెలుసుకుని ఖాతాదారులు తమ కార్య కలాపాలను చేసుకోవాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. .

Exit mobile version