Site icon NTV Telugu

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాలయ్య

టాలీవుడ్ హీరోల్లో బాలకృష్ణ మనసు ఎంతో మంచిదని చాలా మంది చెప్తుంటారు. ఆయనకు కోపం ఉన్నా సరే… సేవాగుణంలో మాత్రం ఆణిముత్యం అని పేరు ఉంది. ఇటీవల ‘ఆహా’ ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అంటూ ఓ షోను బాలయ్య చేస్తున్నాడు. ఆ షో ఫస్ట్ ఎపిసోడ్‌లో అజీజ్ అనే కుర్రాడి గురించి బాలయ్య ఓ వీడియో చూపించాడు. అజీజ్ తన సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం చదువుమానేసి పనిచేస్తున్నాడని ఆ వీడియో ద్వారా ప్రేక్షకులకు వివరించాడు.

Read Also: బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ ట్రైలర్‌ విడుదల

అజీజ్ తన అక్కను కాపాడుకోవాలని కూలీపని చేయడం బాలయ్యను కదిలించింది. దీంతో అతడి అక్కకు హైదరాబాద్‌లోని తన బసవతారకం ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తానని మాట ఇచ్చాడు. తాజాగా బాలయ్య తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అజీజ్ సోదరి బేగంకు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ ప్రారంభమైంది. బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాలయ్య ఈ సాయం అందజేస్తున్నారు. కాగా అటు అజీజ్‌కు కూడా ఉచితంగా విద్య అందజేయాలని హీరో మోహన్‌బాబును బాలయ్య కోరిన సంగతి తెలిసిందే.

Exit mobile version