NTV Telugu Site icon

పారాలింపిక్స్: చరిత్ర సృష్టించిన అవని లేఖారా.. మరో పతకం కైవసం..

టోక్యో పారాలింపిక్స్‌లో భారత షూట‌ర్ అవ‌ని లేఖారా మరో పతకాన్ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు.. ఇప్పటికే 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని అందుకుని.. ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఇప్పుడు మరో ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.. ఇవాళ జరిగిన 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడ‌ల్ సొంతం చేసుకున్నారు అవని లేఖారా.. దీంతో.. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సొంతం చేసుకున్న తొలి భారత క్రీడాకారిణిగా నిలిచారు. ఇప్పటికే భారత్‌ మొత్తం 11 పతకాలు సొంతం చేసుకోగా.. అవని లేఖారా తాజా కాంస్య పతకంతో.. టోక్యో పారాలింపిక్స్‌లో భార‌త్ ప‌త‌కాల సంఖ్య 12కు చేరింది.