Site icon NTV Telugu

ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం… ఆ రాష్ట్రంలో ఒక్క‌రోజే 6 వేల‌కు పైగా కేసులు…

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా, ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరిగిపోతుండ‌టంతో అనేక దేశాల్లో ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు.  యూర‌ప్‌తో పాటుగా ఆస్ట్రేలియాలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఆస్ట్రేలియాలోని అత్య‌ధిక జ‌నాభా క‌లిగిని న్యూసౌత్‌వేల్స్‌లో కేసులు భారీగా పెరుగుతున్నాయి.  న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఒక్క‌రోజులో 6 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  ఈ స్థాయిలో కేసులు న‌మోదుకావ‌డం ఇదే మొద‌టిసారి.  క‌రోనా కేసుల‌తో పాటుగా ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి.  తాజాగా ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం న‌మోదైంది.  

Read: గోవాలో రెచ్చిపోయిన సమంత.. బికినీలో సెగలు రేపుతూ

వెస్ట్ సిడ్నీలోని ఓ వృద్దాప్య కేంద్రంలో 80 ఏళ్ల వ్య‌క్తికి ఒమిక్రాన్ సోకింది.  చికిత్సపొందుతూ ఈరోజు మ‌ర‌ణించాడు.  55 మంది ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంది.  ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌కు త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు.  524 మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.  కేసులు పెరిగిపోతుండ‌టంతో ఆంక్ష‌లు విధించారు.  బార్ అండ్ రెస్టారెంట్‌ల‌లో రెండు చ‌ద‌ర‌పు మీట‌ర్ల దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  ఇక న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల కొర‌త వేధిస్తున్న‌ది.  క్వారంటైన్‌లో ఉన్న ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌నే విధుల్లోకి చేరాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

Exit mobile version