సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు అరాచకాలను చేస్తున్నారు.. వయస్సుతో సంబంధం లేకుండా ఫెమస్ అవ్వడానికి వింత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు జనాలకు ఫన్నీగా అనిపిస్తే.. మరికొన్ని వీడియోలు మాత్రం జనాల సహనాన్ని పరీక్షస్తున్నాయి..తమలోని ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు.. ఈ క్రమంలో ఓ ఆంటీ డ్యాన్స్ ఇరగదీసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..
మనతో మామూలుగా ఉండదు అంటూ.. వీడియోలో రఫ్ఫాడించేసింది..సంప్రదాయబద్దంగా చీర కట్టి.. ఫ్యాషన్ ఐకాన్‌గా సన్‌గ్రాసెస్ పెట్టి.. ఓ పాప్ సాంగ్‌కు తనదైన స్టైల్‌లో డ్యాన్స్ ను ఇరగదీసింది.. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న మహిళ చూడటానికి కాస్త వయస్సు ఎక్కువగా కనిపిస్తుంది..ఆమెలో ఎనర్జీ మాత్రం స్టిల్ సిక్స్‌టీన్ మాదిరిగా ఉంది. చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూనే.. కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుని ఫ్యాషన్ ఐకాన్‌గా మెరిసిపోయింది. ఇక పాప్ సాంగ్ పెట్టుకుని వేసిన డ్యాన్స్ అదుర్స్ అనాల్సిందే. ఈ వయసులోనూ మైఖేల్ జాక్సన్ సిస్టర్ మాదిరిగా, స్టెప్పులేస్తూ అదరగొట్టింది.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే వీడియో ఓ రేంజులో వైరల్ అవుతుంది.. ఇది చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒక లుక్ వేసుకోండి..