NTV Telugu Site icon

మధ్యదరా సముద్రంలో ఘోరం… పడవ మునిగి 57 మంది మృతి… 

మధ్యదరా సముద్రంలో మరో ఘోరం జరిగింది.  లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న వలస దారుల పడవ ట్యునీషియా వద్ద మునిగింది.  ఈ ఘటనలో 57 మంది మృతి చెందారు.  33 మందిని అధికారులు రక్షించారు.  ట్యునీషియాలో వాతావరణం కొంత కుదురుకున్నాక మళ్ళీ వలసలు ప్రారంభం అయ్యాయి.  పరిమితికి మించి పడవలో వలసదారులు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఆఫ్రికా ఖండం మీదుగా ఐరోపా ఖండానికి వలసలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.  అయితే, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తులు బంగ్లాదేశీయులని అధికారులు పేర్కొన్నారు.