NTV Telugu Site icon

అరకులో సంపూర్ణ లాక్ డౌన్… ఎప్పటి వరకు అంటే… 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు.  రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి.  కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలు జరుగుతున్నాయి.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి.  అయితే, ఈ సడలింపులు సమయంలో కూడా పర్యాటకులు అరకు వ్యాలీలో పర్యటిస్తున్నారు.  దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు.  ఈరోజు నుంచి ఈ నెలాఖరు వరకు అరకువ్యాలీలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు.  లాక్ డౌన్ సమయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయని, ప్రజలు నిత్యవసర వస్తవుల కోసమే బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.