ఏపీలో ఆన్ లైన్ టికెట్ల వ్యవస్థకు సర్వం సిద్ధం అవుతోంది. ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థకు నోడల్ ఏజెన్సీగా APSFTVDC నియామించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది APSFTVDC. ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ ఎలా వుండాలనే దానిపై కసరత్తు జరుగుతోంది.
పోర్టల్ రూపకల్పనపై ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్ధలతో ఒకటికి రెండు సార్లు భేటీ నిర్వహించారు మంత్రి పేర్ని వెంకట్రామయ్య, అధికారులు. వివిధ సినీ థియేటర్లతో ప్రైవేట్ టిక్కెటింగ్ ఏజెన్సీల ఒప్పందాలపై తర్జన భర్జన పడుతున్నారు.
ఒప్పందాలు కుదుర్చుకున్న టిక్కెటింగ్ సంస్థలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ప్రభుత్వం వైపు నుంచి చర్యలపై కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒప్పందాల వల్ల ఎలాంటి సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేలా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో రెండు నెలల్లో ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చే అవకాశం వుందంటున్నారు అధికారులు.