ఎమ్మెల్సీలుగా 11మంది వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది సభ్యులు… ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు… విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే… తూర్పుగోదావరి నుండి అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు)…. కృష్ణా జిల్లా నుండి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్ ప్రమాణ స్వీకారం చేశారు.
గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకాశం జిల్లా నుంచి తుమాటి మాధవరావు… చిత్తూరు జిల్లా నుంచి భరత్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా నుంచి ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 11 మంది ఎమ్మెల్సీల చేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు.
