NTV Telugu Site icon

ఏపీ సర్కార్‌ పై మండలి మాజీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంకి ప్రజలు చరమగీతం పాడాలన్నారు. చంద్రబాబు నాయుడిని ఓడించి తప్పు చేసాం అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. 45 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసాం అని ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం కి పరిపాలనా యోగ్యత లేదు.

ప్రజా వ్యతిరేక ఓట్లు విడిపోకుండా పార్టీలు ఏకం కావాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన వామపక్షాలు ఏకం కావాలని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్దిని నిలబెట్టాలన్నారు షరీఫ్. పవన్ కళ్యాణ్ మీద కోపంతో సినిమా రంగంపై కక్ష గట్టింది ఈ ప్రభుత్వం. ఈ ధోరణి మంచిది కాదు. ఈ వివాదానికి పరిష్కారం కనుగొనాలన్నారు.