Site icon NTV Telugu

జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్.. 6కి వాయిదా

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు జగన్. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరిన సంగతి తెలిసిందే. హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది నిరాకరించింది సీబీఐ కోర్టు. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతేడాది హైకోర్టును ఆశ్రయించారు జగన్.

జగన్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టారు జస్టిస్ ఉజ్జల్ భూయాన్. సీఎంగా రోజువారీ విచారణకు హాజరైతే ప్రజా పాలనకు ఇబ్బందని జగన్ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతున్నానని జగన్ అభ్యర్ధించారు. తన వల్ల విచారణ జాప్యం జరుగుతోందన్న వాదనలో నిజం లేదన్నారు జగన్. సీబీఐ వాదనల కోసం విచారణ ఈనెల 6కి వాయిదా వేసింది హైకోర్టు.

Exit mobile version