Site icon NTV Telugu

మానవత్వం చాటుకున్న ఆరోగ్యమంత్రి నాని

ఏపీ ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయంతో రోడ్డు ప్రక్కన పడి ఉన్న బాధితుడిని ఆదుకున్నారు మంత్రి నాని. రోడ్ ఆక్సిడెంట్ లో విజయవాడ కొత్త బస్టాండ్ బెంజ్ సర్కిల్ మధ్యలో రోడ్ పక్కన పడి పోయాడు బాధితుడు శ్రీనివాస్ రెడ్డి. ఆ రూట్‌లో వెళుతున్న మంత్రి ఆళ్ళ నాని వెంటనే స్పందించారు.

వెంటనే కారు దిగి క్షతగాత్రుడు దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్న ఆళ్ళ నాని అధికారులను అప్రమత్తం చేశారు. తన కాన్వాయ్ లోని వాహనంలో హాస్పిటల్ కి తరలించారు మంత్రి ఆళ్ల నాని. హాస్పిటల్ యాజమాన్యంతో ఫోనులో మాట్లాడి క్షతగాత్రుడుకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు మంత్రి ఆళ్ల నాని. క్యాంపు ఆఫీస్ లో కోవిడ్ రివ్యూ మీటింగ్ ముగించుకొని వస్తున్న సమయంలో ఎదురైందీ సంఘటన. మంత్రి స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version