NTV Telugu Site icon

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్..

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలా కుతలం చేశాయి.. మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. దీంతో.. అప్రమత్తం అవుతోంది ఏపీ సర్కార్.. ముఖ్యంగా నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో… ఇవాళ ఉదయం 11 గంటలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం వైఎస్‌ జగన్..

మరోవైపు.. ఇప్పటికే తుఫాన్‌ మిగిల్చిన నష్టంపై కేంద్ర బృందం అంచనా వేసింది.. నాలుగు జిల్లాలో భారీ వరదల నేపథ్యంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం.. తుఫాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని అంచనావేసే పనిలో పడిపోయింది.. ఇక, ఇవాళ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీకానుంది కేంద్ర బృందం.. కాగా, తక్షణ సహాయంగా వెయ్యి కోట్ల ఆర్థిక సహాయం చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరారు ముఖ్యమంత్రి జగన్..