Site icon NTV Telugu

గ‌వ‌ర్న‌ర్‌తో ముగిసిన ముఖ్య‌మంత్రి స‌మావేశం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ తో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం ముగిసింది.  గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల ఆరోగ్య‌ప‌రిస్థితిని ముఖ్య‌మంత్రి దంప‌తులు అడిగి తెలుసుకున్నారు.  పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌లో బాధ‌ప‌డుతున్న గ‌వ‌ర్న‌ర్‌ను కొంత‌కాలం విశ్రాంతి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.  కొన్ని రోజుల క్రితం బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ క‌రోనా బారిన ప‌డ్డారు.  హైదారాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు.  అయితే, పోస్ట్ క‌రోనా త‌రువాత మ‌ళ్లీ ఇబ్బందులు త‌లెత్త‌డంతో తిరిగి హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రిలో కొన్నిరోజులు ట్రీట్మెంట్ తీసుకొని  కోలుకున్నాక ఏపీ వ‌చ్చారు. కాగా, ఈరోజు గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌ను క‌లిసి ఆయ‌న ఆరోగ్య‌ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌.  

Read: సెమీకండ‌క్ట‌ర్ చిప్స్ త‌యారీకి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌… భారీగా నిధులు కేటాయింపు…

Exit mobile version