ఏపీలో పీఆర్సీ అంశం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. పీఆర్సీ పై సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఉద్యోగులు అడుగుతున్నంత కాకపోయినా వారు ఆనందంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇప్పటికే పేర్కొన్నారు. ఉద్యోగులు సహజంగా వాళ్ళ డిమాండ్స్ చేశారని, అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సీఎం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇప్పటికే సీఎం ఉద్యోగులకు చెప్పారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం ఉత్తమమయిన మార్గం వెల్లడిస్తారన్నారు.
LIVE:పీఆర్సీపై సీఎం జగన్ అధికారిక ప్రకటన
