Site icon NTV Telugu

సతీసమేతంగా గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్.. కీలక అంశాలపై చర్చ

ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ దంపతులను సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ భార్యకు సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి మొక్కను అందజేశారు. అనంతరం గవర్నర్‌తో సీఎం జగన్ ఏకాంతంగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు.

నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. అనంతరం శాసనసభా సమావేశాల నిర్వహణ, టీడీపీ కార్యాలయాలపై దాడులకు దారి తీసిన పరిస్థితులను గవర్నర్‌కు సీఎం జగన్ వివరించారు. తనపట్ల తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో చర్చించారు.

Exit mobile version