Site icon NTV Telugu

అనుష్క బర్త్ డే కానుక… అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్

టాలీవుడ్‌లో జేజమ్మగా అందరినీ అలరించిన అనుష్క శెట్టి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. గత ఏడాది నిశ్శబ్ధం సినిమాను ఆమె చేసినా ఆ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. కానీ ఆ సినిమా అభిమానులను నిరాశపరిచింది. అయితే ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు కావడంతో ఆమె నటించనున్న కొత్త సినిమాపై అప్‌డేట్ విడుదలైంది. యూవీ క్రియేషన్స్ బ్యానరులో ఆమె కొత్త చిత్రం చేయనుంది. ఈ మూవీ అనుష్క కెరీర్‌లో 48వ సినిమాగా రానుంది. ప్రముఖ దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క 48వ చిత్రాన్ని చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

కాగా యూవీ క్రియేషన్స్ బ్యానరులో అనుష్క గతంలో రెండు సినిమాల్లో నటించింది. అందులో మొదటిది ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ కాగా.. రెండోది లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘భాగమతి’. భాగమతి మూవీ 2018లో విడుదలైంది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానరులో నటించబోతోంది. ఈ మూవీ తమ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. కాగా ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి కీలకపాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read Also: రివ్యూ: సూర్యవంశీ (హిందీ)

Exit mobile version