Site icon NTV Telugu

శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లు..

trains

trains

అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి పెరగడంతో దక్షణిమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

కాచిగూడ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నాందేడ్‌ స్టేషన్‌ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలుస్తోంది. జనవరి 3 నుంచి 16 వరకు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్ఉల దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే నెలలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్లు పూర్తిగా నిండిపోయాయి.

Exit mobile version