NTV Telugu Site icon

Angry Hippos: సింహంపై హిప్పో దాడి.. బెదిరిపోయిన అడవి రాజు.. ఏం జరిగిందంటే..

Lion Vs Hippo

Lion Vs Hippo

అడివికి రాజు అంటే సింహం. తమ భూభాగం విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తాయి సింహాలు. తమ ప్రాణాలు వదిలేస్తాయి గానీ వేరే జంతువు ఆ చుట్టుప్రక్కల ఆక్రమిస్తే ఊరుకోవు. ఒక రాజులా కాపాడుకుంటాయి. అందుకే కేవలం ఆహారం కోసమే కాదు ఆక్రమించడానికి వచ్చినా చంపేస్తాయి. అందుకే సింహిం ‘అడవికి రాజు’ అనే బిరుదును పొందింది. అడవిలో సింహం గర్జిస్తే ఇతర జంతువులు భయంతో వణికిపోతాయి. సింహం వస్తుందంటే చాలు పారిపోతాయి. అలాంటి అడగి రాజు అయిన సింహాన్నే ఓ హిప్పోల గుంపు బెదరగొట్టింది. సింహంపై దాడి చేసి మరీ బెదరగొట్టింది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియోలో హిప్పోల గుంపు సింహంపై దాడి చేసి భయపెట్టడం కనిపిస్తుంది.
Also Read:Krishna Vamsi: షడ్రుచుల సమ్మేళంగా ‘రంగమార్తాండ’!

క్రూగర్ నేషనల్ పార్క్‌లో సింహం నది మధ్యలో ఉన్న ఒక రాతిపై కూరుకుపోయింది. దీంతో అకస్మాత్తుగా,హిప్పోలు సింహాన్ని చుట్టుముట్టాయి. హిప్పోలలో ఒకటి సింహంపై దాడి చేసి, దానిని నీటిలోకి తోసేసింది. దీంతో బెదిరిపోయిన సింహం.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. నీటి కింద దాక్కున్న మరో హిప్పో పైన సింహాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Also Read: Medical Insurance: ఆస్పత్రిలో చేరకపోయినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!

నది మధ్యలో ఉన్న రాతిపై సింహం కూర్చున్నట్లు వీడియోలో ఉంది. అసలు అక్కడికి ఎలా చేరిందో తెలియదు. వెంటనే, హిప్పోల గుంపు సింహం వైపు కదులుతుంది. ఇది గమనించిన సింహం.. తాను కూర్చున్న బండ చుట్టూ తిరుగుతుంది. అకస్మాత్తుగా, హిప్పోల గుంపులోని ఒకటి సింహంపై దూకింది. కోపంతో ఉన్న హిప్పోల గుంపు నుండి తప్పించుకోవడానికి సింహానికి నీటిలోకి దూకడం తప్ప మరో మార్గం లేదు. చివరికి, మరొక హిప్పో సింహం కోసం వెళ్ళింది, కానీ పెద్ద పిల్లి త్వరగా తప్పించుకుంది. కాగా, ఈ వీడియో ఈ వీడియో మార్చి 14న సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఇప్పటికే 17 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది.