NTV Telugu Site icon

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసి పల్లకిలో ఊరేగింపు..

Tribute To Mla

Tribute To Mla

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తమ ప్రియతమ నాయకుడికి ప్రజలు ఊరేగించారు.. అనంతరం పాలాభిషేకం కూడా చేశారు..గతంలో ఓ నాయకుడు తమ ఊరికి రోడ్లు వేయించడం తో గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు.. ఇప్పుడు మరో నేత కు ప్రజలు నీరాజనం పలికారు.. ప్రజల అభిమానాన్ని చూసిన నేత బావోద్వేగానికి గురవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అంతగా ఆ ఎమ్మెల్యే ఏం చేశారంటే..ఇక ఎప్పటికి తమ గ్రామానికి రోడ్డును చూడలేము అనుకున్న వారి కలను నెరవేచ్చాడు. దాంతో జనాలు ఆయనకు ఘనంగా పాలాభిషేకంను నిర్వహించారు..

వివరాల్లోకి వెళితే..పార్వతీపురం మన్యం జిల్లా బలిజి పేట మండలం పి. చాకరాపల్లి గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేరింది. గత ఏబై ఏళ్లుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు. చిన్నపాటి అవసరానికి అయినా గ్రామం నుండి బయటకు రావాలంటే గ్రామస్తులు అష్టకష్టాలు పడేవారు.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళడం గ్రామానికి రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వడం ఇక్కడ పరిపాటిగా వస్తుంది. ఈ క్రమంలోనే జరిగిన 2019 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ గ్రామానికి ప్రచారానికి వెళ్ళారు. అందులో భాగంగా పార్వతీపురం వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు..

అంతే ఆ మాటతో ఆయనను భారీ మెజారిటితో గెలిపించారు.. దాంతో ఆ ఎమ్మెల్యే ఇచ్చిన హామీను నెరవేర్చారు.. అన్నట్లుగానే నాలుగు కిలో మీటర్ల మేరకు రోడ్లు వేయించారు..రోడ్డు నిర్మాణంతో సుమారు మూడు వందల కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ గ్రామానికి దశాబ్దాల కల నెరవేరింది. దీంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు ను సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు..ఈ క్రమంలో ఆయనను తమ గ్రామానికి సాధారంగా ఆహ్వానించారు.. మేళ, తాలలతో ఊరేగించారు..దారి పొడవునా పూల వర్షం కురిపించారు.. అనంతరం గ్రామంలోని మహిళలు వందల లీటర్ల పాల బిందెలతో పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.. తనకు జరిగిన సన్మానం తో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు ఎమ్మెల్యే.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి..