NTV Telugu Site icon

అనంత‌పురంలో రాత్రివేళ పోలంలో వింత‌శ‌బ్దాలు… వెళ్లి చూడ‌గా…

అనంత‌పురం జిల్లాల్లో గుప్త‌నిథుల కోసం త‌వ్వ‌కాలు ఇటీవ‌ల కాలంలో మ‌రింత ఎక్కువయ్యాయి.  పాత ఆల‌యాలు, పాత గృహ‌స‌ముదాయాలు క‌నిపిస్తే చాలు మూడో కంటికి తెలియ‌కుండా గుప్త‌నిథుల వేట‌గాళ్లు త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నారు.  అనంత‌పురం జిల్లాలోని యాడికి మండ‌లంలోని పుష్పాల‌-చింత‌ల‌చెరువు ప్రాంతంలోని సుంక‌ల‌మ్మ గుడికి స‌మీపంలో ఉన్న‌పాత బురుజు ప్రాంతంలోని పొలంలో రాత్రి స‌మ‌యంలో తవ్వ‌కాలు జ‌రిపారు.  అయితే, రాత్రి స‌మ‌యంలో పొలం నుంచి వింత శ‌బ్దాలు రావ‌డంతో స్థానికుల‌కు అనుమానం వ‌చ్చింది.  వెంట‌నే అక్క‌డికి వెళ్లి చూసి షాక్ అయ్యారు.  కొంత‌మంది వ్య‌క్తులు జేసీబీని తీసుకొచ్చి తవ్వ‌కాలు జరుపుతుండ‌గా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.  హుటాహుటిన అక్క‌డికి చేరుకున్న పోలీసులు కొంత‌మందిని అదుపులోకి తీసుకున్నారు.  కేసును పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Read: అమెజాన్‌పై ఆర్ఎస్ఎస్ కీల‌క వ్యాఖ్య‌లు… జాగ్ర‌త్త‌గా లేకుంటే…