NTV Telugu Site icon

అనంతలో రికార్డ్ బ్రేక్.. వానలే వానలు

అనంతపురం జిల్లాలో రికార్డులు బద్ధలయ్యాయి. కరువుసీమలో వందేళ్లలో లేనంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏడాదంతా కురిసే వర్షం నెలరోజుల్లోనే 40 శాతం కురిసింది. భారీ స్థాయిలో వానలు కురవడంతో నష్టం కూడా బాగా పెరిగింది. నిత్యం కరువుతో వుండే ప్రాంతంలో వానలే వానలు. మంచి నీటి కోసం ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు వాటర్ పైప్ లైన్లు పాడయిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో కనీవీనీ ఎరుగని రీతిలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాణాలు కూడా పోయాయి. 150 ఏళ్ళలో ఇలాంటి వానలు రెండవసారి అంటున్నారు. 1903, 2021లో భారీ వర్షం కురిసింది. అంచనాలకు మించి పడ్డ వానలతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. 500 కోట్లకు పైగా పంటలు నష్టపోయాయి.