Site icon NTV Telugu

మందు పంపిణీపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు

Anandaiah

ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించిందని.. ప్రభుత్వ సహకారం పూర్తిగా తనకు ఉందని ఆనందయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతోనే మందు పంపిణీ చేస్తానని.. మూడు రోజుల్లో తమ కుటుంబ సభ్యులు, అధికారులతో చర్చించి ముందు ఎప్పుడు పంపిణీ చేసిందో వెల్లడిస్తానని తెలిపారు. పోలీసులు నిర్బంధించలేదని, రక్షణ కల్పించారని..ఉన్నవాళ్ళకి కాదు లేని వాళ్లకు కూడా మందు పంపిణీ చేశానన్నారు. మందుకు కావలసిన వనమూలికలు సమృద్ధిగా ఉన్నాయని..ఇప్పటి వరకు 50 వేల మందికి పంపిణీ చేశానని పేర్కొన్నారు. మొదటగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చి ఇతరులకు పంపిణీ చేస్తానని వెల్లడించారు.

Exit mobile version