Site icon NTV Telugu

తొలి కేసు: గోవాలో 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్‌..

గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఖండతరాలు దాటి పలు దేశాల్లో విజృంభిస్తోంది. యూకే, యూఎస్‌లో ఒమిక్రాన్‌ ప్రభావం అధికంగా ఉంది. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గోవాలో 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్‌గా సోకింది. ఈ నెల 17న బాలుడు యూకే నుంచి వచ్చాడు. అయితే యూకే ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఇండియాకు చేరుకున్నాడు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో విదేశాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకంగా కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోవాకు చేరుకున్న బాలుడికి టెస్ట్‌ల్లో పాజిటివ్‌ రాగా బాలుడు శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో ఒమిక్రాన్‌గా తేలింది. ప్రస్తుతం ఆ బాలుడి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోవాలో ఇదే మొదటి ఒమిక్రాన్‌ కేసు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

https://ntvtelugu.com/night-curfew-in-many-states/
Exit mobile version