Site icon NTV Telugu

గుడ్ న్యూస్‌: 6 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్‌…

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు భ‌య‌ప‌డి వాహ‌న‌దారులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు ప‌రుగులు తీస్తున్నారు.  ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నా ఛార్జింగ్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి.  వాహ‌నాల బ్యాట‌రీ ఫుల్ ఛార్జింగ్ కావాలంటే క‌నీసం రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.  అయితే, ఈ క‌ష్టాల‌కు త్వ‌రలోనే చెక్ ప‌డ‌నుంది.  ఆంప్రియ‌స్ టెక్నాల‌జిస్ కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.  కేవ‌లం 6 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ చేసే టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చింది.  

Read: ఒమిక్రాన్‌ను వ్యాక్సిన్‌లు పూర్తిగా అడ్డుకోలేవా?

370కేవీ అవుట్‌పుట్ ఛార్జ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది.  దీనిపై ఇప్ప‌టికే మొబైల్ ప‌వ‌ర్ సోల్యూష‌న్ అనే కంపెనీ ప‌రీక్షించింది.  80 శాతం బ్యాట‌రీ ఛార్జింగ్ కావ‌డానికి 6 నిమిషాల కంటే త‌క్కువ స‌మ‌యం ప‌ట్టిన‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  బ్యాట‌రీ ఫుల్ ఛార్జ్ చేయ‌డానికి 20 నిమిషాల స‌మ‌యం ప‌ట్టిన‌ట్టు కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Exit mobile version