ప్రస్తుతం మన దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తుంది. రోజుకు దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ సమయంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి కొంత మంది కరోనా విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ కరోనా విరాళాల సేకరణ పై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పంచ్ వేశారు. అయితే తాను నిధుల సేకరణ ప్రారంభించకపోవడానికి కారణాలు ఉన్నాయని… ఇతరుల నుండి డబ్బు అడగడం ‘ఇబ్బందికరంగా’ ఉందని అన్నాడు. కానీ తాను సొంతంగా చేయగలిగినదంతా చేస్తానని చెప్పాడు.
అలాగే తాను ఇతరులు ప్రారంభించిన ఈ కరోనా నిధుల సేకరణను గమనిస్తున్నాను అని ”వారందరు ఇప్పటివరకు సేకరించింది… కేవలం తాను ఒక్కడు ఇచ్చిన దానికి సమానంగా ఉంది. కానీ “నేను అడగలేదు .. ఇచ్చాను” అన్నాడు అమితాబ్. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ అనుష్క శర్మ మరియు ప్రియాంక చోప్రా వంటి వారు కరోనా విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అనుష్క మరియు విరాట్ ఇప్పటివరకు 11 కోట్లకు పైగా నిధులు సేకరించిన విషయం తెలిసిందే. కానీ అమితాబ్ ఇచ్చిన విరాళమే 25 కోట్ల సమీపంలో ఉంటుంది.