NTV Telugu Site icon

ఒమిక్రాన్ టెన్ష‌న్‌: క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగితే ఏంచేయాలి…!!

ప్ర‌పంచం మొత్తం మీద ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  డెల్టా నుంచి కోలుకోక ముందే ఒమిక్రాన్ వేరియంట్ ఎటాక్ చేస్తున్న‌ది.  శీతాకాలం కావ‌డంతో సాధార‌ణంగానే చ‌లి తీవ్ర‌త పెరిగింది.  ఫ‌లితంగా జ్వ‌రం, త‌ల‌నొప్పి వంటి వాటితో ఇబ్బందులు ప‌డుతున్నారు.  అనారోగ్యం బారిన ప‌డిన‌ట్టు అనిపించినా, క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగినా భ‌య‌ప‌డిపోతాం.   పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగితే ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దో తెలుసుకుందాం.  

Read: భార‌త్‌లో జీరో నోటు… ఎందుకు వినియోగిస్తారో తెలుసా?

ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఒమిక్రాన్ కేసులు బ్రిట‌న్‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసుల‌తో పాటు, మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరిగిపోతున్న‌ది.  ఇక భార‌త్‌లోనూ క్ర‌మంగా కేసులు పెరుగుతున్నాయి.  తెలిక‌పాటి జ్వ‌రం, గొంతు నొప్పి, బాడీపెయిన్స్ వంటిని ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.  ఇలాంటి ల‌క్ష‌ణాలున్న అంద‌రికీ ఒమిక్రాన్ సొకుతుంది అనే గ్యారెంటీ లేదు.  ఈ ల‌క్ష‌ణాలు ఉంటే క‌రోనా టెస్టు చేయించుకోవ‌డం ఉత్త‌మం.  ఒక‌వేళ ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తే మీరు ఐసోలేష‌న్‌లో ఉండ‌టం ఉత్త‌మం.  

Read: బీటెక్ విద్యార్థులకు తెలంగాణ హైకోర్టు తీపికబురు

న‌లుగురితో క‌లిసి ఉండ‌కుండా ఐసోలేష‌న్‌లో ఉంటే క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.  ఒక‌వేళ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగితే మాస్క్ ధ‌రించ‌డం, శానిటైజ‌ర్ వాడ‌టం వంటివి చేయాలి.  సోష‌ల్ డిస్టెన్స్ ను పాటించాలి.  అన్నింటికంటే ఉత్త‌మంమైన ప‌ని ఎవ‌రికి వారు ఐసోలేష‌న్‌లో ఉండటం.  ఐసోలేష‌న్ చేసుకుంటే ఇన్ఫెక్ష‌న్ మ‌రొక‌రికి సోకకుండా ఉంటుంది.  శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఉన్నా, చెస్ట్ పెయిన్‌గా ఉన్న‌ట్టు అనిపించినా, శ్వాస‌సంబంధ‌మైన ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తినా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించడం ఉత్త‌మం.  

Read: మునుపటి కంటే ‘అన్ స్టాపబుల్’ వినోదం!

సీడీసీ ప్ర‌కారం తప్ప‌నిస‌రిగా 10 రోజుల‌పాటు ఐసోలేష‌న్‌లో ఉండాలి.  10 రోజుల త‌రువాత మ‌రోసారి క‌రోనా టెస్ట్ చేయించుకోవాలి.  ఒక‌వేళ నెగెటివ్ వ‌చ్చినా,  వారం పాటు ఐసోలేష‌న్‌లోనే ఉండి ఆ త‌రువాత బ‌య‌ట‌కు రావ‌డం ఉత్త‌మం.  క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత పోస్ట్ కోవిడ్ ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది.  త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే క‌రోనా నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డొచ్చు.