NTV Telugu Site icon

అలిపిరిలో ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు భారీ ఎత్తున ఉద్యమం చేపట్టారు. వారు చేపట్టిన మహాపాదయాత్ర అలిపిరి శ్రీవారి పాదాల వద్జ ముగిసింది. కొబ్బరికాయలు కొట్టి అలిపిరి వద్ద యాత్ర ముగించారు అమరావతి రైతులు. అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని కొబ్బరి కాయలు కాట్టి శ్రీవారిని వేడుకున్నారు. నవంబర్‌ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 45వ రోజల పాటు సాగింది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 400 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. కేవలం 500 మందికి మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. రేపు, ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు. ఈ నెల 17న అమరావతి ఆకాంక్షను చాటేలా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అమరావతి జేఏసీ నేతలు తెలిపారు.