NTV Telugu Site icon

సిక్స్ ప్యాక్ తో అల్లు శిరీష్ రచ్చ… పిక్ వైరల్

Allu Sirish Six Pack Mirror Selfie Goes Viral

అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ సినిమాలతో పాటు, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపుతాడు. ఈ యంగ్ హీరో ఇటీవల తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో అద్భుతంగా కనిపించాడు. అల్లు శిరీష్ జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం తీసుకున్న మిర్రర్ సెల్ఫీలో సిక్స్ ప్యాక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రస్తుతం తాను నటిస్తున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్టైనర్ చిత్రీకరణలో ఉన్నాడు. ఈ చిత్రం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. చాలాకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న అల్లు శిరీష్ ఇటీవలే “విలాయతి శరబ్” అనే హిందీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో రచ్చ చేసాడు. ఇక మళ్ళీ తాను సినిమాలకు సిద్ధం అంటూ ఇటీవలే ప్రకటించాడు అల్లు శిరీష్. కాగా 2019లో అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత మళ్ళీ ఇంతకాలానికి వార్తల్లో నిలుస్తున్నాడు అల్లు వారబ్బాయి.