Site icon NTV Telugu

యూపీలో కొత్త టెన్ష‌న్‌… అఖిలేష్ భార్య‌కు క‌రోనా పాజిటివ్‌…

యూపీలో ఎన్నిక‌ల వేడి ర‌గులుకున్న సంగ‌తి తెలిసిందే.  వ‌చ్చే ఏడాది యూపీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది.  దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి.  ప్ర‌చారంలో భాగంగా స‌మాజ్‌వాదీ పార్టీ  నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ రాష్ట్రం మొత్తం సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ప్ర‌చారం చేస్తున్నారు.  అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించారు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా అఖిలేష్ యాద‌వ్ భార్య డింపుల్ యాద‌వ్‌కు క‌రోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా ఆమెకు క‌రోనా సోక‌డంతో పార్టీలో టెన్షన్ మొద‌లైంది.  క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో క‌రోనా సోకిన‌ట్టుగా తేల‌డంతో ఐసోలేష‌న్‌లో ఉన్నారు.  

Read: క‌రోనాకు మ‌రో కొత్త వ్యాక్సిన్‌…ఆస్ట్రేలియాలో స‌క్సెస్‌… కానీ…

ఈ విష‌యాన్ని స్వ‌యంగా డింపుల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.  కాగా, భార్య‌కు క‌రోనా సోక‌డంతో అఖిలేష్ కూడా ఐసోలేష‌న్‌లో ఉన్నాడు.  త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా ప్రోటోకాల్ ప్ర‌కారం నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని డింపుల్ యాదవ్ ట్వీట్ చేసింది.  రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ నేత జ‌యంత్ చౌద‌రితో క‌లిసి రేపు అలీఘ‌ర్‌లో అఖిలేష్ యాద‌వ్ ప్ర‌చారం చేయాల్సి ఉంది. రేపు జ‌రిగే ప్ర‌చార‌యాత్ర‌కు అఖిలేష్ హాజ‌ర‌వుతారా లేదా చూడాలి.

Exit mobile version