పండుగల సమయంలో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. రైళ్లన్ని కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎటు చూసినా ప్రయాణికులే కనిపిస్తుంటారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ట్రైన్ ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యి రిజల్ట్ వచ్చే వరకు విమానాశ్రయం వదిలి వెళ్లరాదనే ఆంక్షలు ఉండటంతో ప్రయాణికులతో ఎయిర్‌పోర్టులు కిక్కిరిసిపోతున్నాయి.
Read: వైరల్: పాముకాటుకు నాటుకోడి వైద్యం…
కరోనా టెస్టులు చేయించుకొని రిజల్ట్ వచ్చేందుకు కనీసం 4 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. అప్పటి వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉంటున్నారు. దీంతో రద్దీ పెరిగిపోతున్నది. సోషల్ డిస్టెన్స్ గాలికొదిలేశారు. దీంత ఇప్పుడు ఎయిర్ పోర్టులు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారే ప్రమాదం ఉండటంతో సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఎయిర్ పోర్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులకు ఇబ్బందలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాథిత్య సింధియా అధికారులను ఆదేశించారు.
