ప్రస్తుతం అందరి చూపు ప్రభాస్ ఆదిపురుష్ పైనే ఉంది.. సినీ అభిమానులు, డార్లింగ్ ఫ్యాన్స్ అందరు కూడా వెతికే పేరు ఓం రౌత్..ఎవరితను ఎక్కడ నుండి వచ్చాడు, అసలు ప్రభాస్ కి ఎలా పరిచయం అయ్యాడు.. గతంలో ఎన్ని సినిమాలు చేశారు.. ఎవరితో చేశారు.. ఆదిపురుష్ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. ఇలా చాలా ప్రశ్నలు జనాలకు వస్తున్నాయి.. అయితే ఓం రౌత్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈయన ముంబై లో పుట్టాడు..అతని తల్లి నీనా టెలివిజన్ నిర్మాత అయితే, తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్, అలాగే రచయిత, రాజ్యసభ సభ్యుడు కూడా.. ఈయన తాత సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అందుకే ఇతనికి సినిమాలంటే ఫ్యాషన్ ఏర్పడింది..దర్శకుడు కాక ముందు ఓం రౌత్ చైల్డ్ ఆర్టిస్టు గా పని చేసాడు, అలాగే కాలేజీ లో జరిగే నాటకాల పోటీల్లో కూడా పాల్గొనేవాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా ‘కారమతి కోట్’ అనే సినిమా చేసాడు ఓం రౌత్. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒక కీ రోల్ చేసాడు. డిగ్రీ అయ్యాక, సిరక్యూస్ విశ్వవిద్యాలయం న్యూయార్క్ వెళ్లి అక్కడ ఫిలిమ్స్ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఓం రౌత్ డిగ్రీలో సబ్జెక్టు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు..
ఆ తర్వాత న్యూ యార్క్ లో ఏంటీవీ లో పనిచేసాడు.. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు..ఓం రౌత్, మరాఠీ భాషలో ‘లోకమాన్య.. ఏక్ యుగ్ పురుష్ అనే సినిమా చేసాడు. ఈ సినిమాకి నిర్మాత ఎవరో తెలుసా, ఓం రౌత్, అతని తల్లి నీనా ఇద్దరూ కలిపి స్థాపించిన నీనా రౌత్ ఫిలిమ్స్. ఇది అందరి ప్రసంశలు అందుకున్న సినిమానే కాకుండా, దీనికి బెస్ట్ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన వ్యక్తి.. తానాజీ,ఇలా ఒక మరాఠి సినిమా, ఒక హిందీ సినిమా చేసిన ఓం రౌత్ ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు… మొత్తానికి ఈయన మూడు సినిమాలు చేశాడు.. ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఏం జరుగుతుందో మరి కొద్ది గంటల్లో తెలిసిపోతుంది..