మురిపించిన ముమైత్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 1న ముమైత్ ఖాన్ పుట్టినరోజు)
ఐటమ్ నంబర్స్ లో నీటుగా, కొన్నిసార్లు నాటుగా, మరికొన్ని సార్లు ఘాటుగా, ఇంకొన్ని సార్లు ఎదుటివారికి దీటుగా చిందేసి కనువిందు చేసిన భామ ముమైత్ ఖాన్. ముఖ్యంగా ముమైత్ తన నడుమును లయబద్ధంగా తిప్పుతూ చేసే ‘బెల్లీ డాన్స్’కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పాటల కోసమే సినిమాలకు వెళ్ళిన వారూ లేకపోలేదు. ముమైత్ ఐటమ్ సాంగ్స్ లో మురిపించిన తీరును ఇప్పటికీ అభిమానులు తలచుకొని ఆనందిస్తూనే ఉన్నారు. ఇంతలా ఐటమ్స్ లో అలరించిన ముమైత్ కొన్ని చిత్రాలలో కీలక పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. నటిగా, నర్తకిగా తనదైన బాణీ పలికించిన ముమైత్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం మాదకద్రవ్యాల కేసులో విచారణకు గురయ్యారు. మరోమారు ఆమె ఆ కేసులో విచారణను ఎదుర్కోనున్నారు. ఈ సారి ఇ.డి. ప్రశ్నలకు ముమైత్ సమాధానం చెప్పాల్సి ఉంది. అదలా ఉంచితే ‘బిగ్ బాస్ సీజన్ 1’లోనూ అలా తళుక్కుమని, కేసు వల్ల మధ్యలోనే బయటకు రావలసి వచ్చింది.
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ముమైత్ ఖాన్ పుట్టి, పెరిగింది ముంబైలోనే. ఆమె తల్లి స్వస్థలం చెన్నై. తండ్రి పాకిస్థానీ. మొదటి నుంచీ అందాలతో కనువిందు చేయడానికే సై అంది ముమైత్. దాంతో ఆమెను ఐటమ్ నంబర్స్ మాత్రమే పలకరిస్తూ వచ్చాయి. ‘మున్నాభాయ్ ఎమ్.బి.బి.ఎస్.’తో మంచి గుర్తింపు లభించింది. తరువాత తెలుగు చిత్రసీమలో హరికృష్ణ నటించిన ‘స్వామి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తమిళ, కన్నడ, బెంగాలీ, ఒడియా భాషల్లో తన నర్తనంతో మత్తెక్కించింది. పూరి జగన్నాథ్ చిత్రాలు – “1 4 3, పోకిరి” ముమైత్ కు తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే…” అంటూ ‘పోకిరి’లో ముమైత్ చిందేసిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు. ఇక ‘యోగి’లో “ఓరోరి యోగి…”అంటూ మురిపించిన వైనాన్ని గుర్తు చేసుకొని మరీ చిందులేసే వారున్నారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో ముమైత్ నడుముతో నాట్యం చేసిన విధానం తరువాతి రోజుల్లో ఎంతోమంది నర్తకీమణులు అనుసరించేలా చేసింది. ఇక ‘మగధీర’లో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకొని అలరించింది ముమైత్. “ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపియస్, మంగతాయారూ టిఫిన్ సెంటర్, పున్నమినాగు” వంటి చిత్రాలలో ముమైత్ ఖాన్ కీలకమైన పాత్రలు పోషించి మెప్పించారు. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ కే పరిమితమై ‘ఐటమ్ గాళ్’ గానే గుర్తింపు సంపాదించారు ముమైత్. తెలుగునాటనే ఆమెలోని నటికి మంచి అవకాశాలు లభించాయని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు చిత్రం ‘హెజా’లో ముమైత్ నటిస్తున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!