మాటల ‘కోట’… నవ్వుల తోట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేక పోతున్నారు కానీ, అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలచుకొని ఇప్పటికీ పడిపడి నవ్వేవారు ఎందరో ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు, మరికొందరు కసాయితనం చూపించీ ప్రతినాయకులుగానూ మెప్పించారు. ఆ తరహా పాత్రల్లోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తిమీద సాములాంటిది! అలాంటి సాములను అనేకమార్లు అవలీలగా చేసిన ఘనుడు కోట శ్రీనివాసరావు. ఆయన మాటలు కోటలు దాటుతాయి, కోట్లూ కుమ్మరించాయి. బాక్సాఫీస్ రికార్డులు బీటలు వారేలా చేశాయి. ఎందరికో గెలుపు బాటలూ వేశాయి. అందుకే కోట శ్రీనివాసరావు మాటంటే తెలుగువారికి మహా ఇష్టం.
కలలుంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే! కళలన్నవి కొందరికే – అవి నెరవేరాలంటే గుమ్మడి కాయంత ప్రతిభకన్నా ఆవగింజంత అదృష్టం కావాలి అంటారు పెద్దలు. కోట శ్రీనివాసరావులో పేద్ద పనసకాయంత ప్రతిభ ఉంది. కానీ, ఆరంభంలో ఆవగింజంత అదృష్టం వరించలేదు. 1978లో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’తోనే తొలిసారి తెరపై కనిపించారు కోట. అయితే ఆయన నవ్వుల బాట తెలుగువారికి పరిచయం కావడానికి జంధ్యాల మెగాఫోన్ పట్టవలసి వచ్చింది. జంధ్యాల చిత్రాలు కోట అభినయానికి పెద్ద పీట వేశాయి. ప్రతీసారి కోట మార్కు నటన ప్రేక్షకుల చేత మార్కులు వేయించుకుంటూనే సాగింది. హాస్యనటునిగా, గుణచిత్ర నటునిగా పలుమార్లు అవార్డులూ, రివార్డులూ సంపాదించారు కోట. అయితే ప్రతినాయకునిగా నాలుగు సార్లు నందులు అందుకున్న ఘనత ఆయనకు మాత్రమే దక్కింది.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
తన మాటల తూటాలతో ప్రేక్షకులకు వినోదం పంచిన కోట రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు కోట. తరువాత ఓటమి చవిచూసిన కోట, మళ్ళీ నటనలోనే కొనసాగారు. అయితే, ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. 2015లో కోటకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయప్రవేశం చేసి మునుపటిలా వినోదం పంచాలనే ఉత్సాహంతోనే ఉన్నారాయన. జూలై 10తో 78 ఏళ్ళు పూర్తి చేసుకుంటోన్న కోట శ్రీనివాసరావు మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!