చెక్ పోస్ట్‌లు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పలమనేరు ఆర్టీవో చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. పలమనేరు కేటిల్ ఫామ్ వద్దనున్న ఆర్టీవో చెక్ పోస్ట్ పై దాడులు చేశారు. తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులు నిన్న రాత్రి నుండి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం,
చిత్తూరు జిల్లా నరహరి పేట,పలమనేరు ఆర్టీఓ చెక్ పోస్ట్,లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది, ఈ తనిఖీల్లో నరహరి పేట చెక్ పోస్ట్ నందు 75 వేల రూపాయల నగదు అనధికారికంగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు, పలమనేరు చెక్ పోస్ట్ దాడులపై అధికారులను ప్రశ్నించగా ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు, మా పైస్థాయి అధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. గత కొంతకాలంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున అనధికారిక నగదు సిబ్బంది దగ్గర వుంటోందని అంటున్నారు.